బిగ్ షాక్ : ఈ లాజిక్ ప్రకారం టైటిల్ విన్నర్ అతనేనా..?

Thursday, October 17th, 2019, 02:48:11 PM IST

ఇంకా ఎలాగో తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ చివరి స్టేజ్ కు చేరుకుంటుండడంతో టైటిల్ విన్నర్ ఎవరు అన్న అంశం ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో నడుస్తుంది.అయితే ఇప్పటిదాకా బిగ్ బాస్ టైటిల్ ఆల్రెడీ ఒకరికి రిజర్వుడ్ అని పెద్ద స్థాయిలో ప్రచారం చేసిన వారే ఇప్పుడు ఇంకొకరికి టైటిల్ దక్కుతుంది అని అంటున్నారు పైగా ఈ హింట్ ను కూడా స్వయంగా బిగ్ బాసే వెల్లడి చేసారని మరో ఆసక్తికర పాయింట్ ను సోషల్ మీడియాలో రైజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కో కంటెస్టెంట్ తాలూకా ఫ్యామిలీ వస్తున్న సంగతి చూస్తున్నాము.అయితే ఈ రోజు వదిలిన ప్రోమోలో అందరి ఫ్యామిలీస్ కు అతీతంగా ఒక్క రాహుల్ ఫ్యామిలీ(తన తల్లి) ఇంట్రో మాత్రం కాస్త స్పెషల్ గా ఇచ్చినట్టు చూపించారు.అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే గత సీజన్లో కూడా సేమ్ ఇలానే టైటిల్ విన్నర్ కౌషల్ మంద పిల్లలు కూడా రాహుల్ తల్లి లానే కాన్ఫెషన్ రూమ్ లో ఉండే తన తండ్రితో మాట్లాడారు.

అది కూడా అప్పుడు కౌషల్ ఇప్పుడు రాహుల్ లకు మాత్రమే జరిగాయని దీని ద్వారా ఈసారి విన్నర్ రాహులే అన్నట్టుగా బిగ్ బాస్ హింటిస్తున్నారు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఈ లాజిక్ ను చెప్తున్నారు.మరి ఈ లాజిక్ ను బిగ్ బాస్ నిజం చేస్తారా లేదా చూడాలి.అసలే ఇది బిగ్ బాస్ ఇక్కడ ఏమన్నా జరగొచ్చు..