బిగ్ బాస్ : ఇంత ఫన్ ఉందంటే ట్విస్ట్ కూడా గట్టిగా ఉంటుంది.!

Sunday, October 20th, 2019, 07:00:57 PM IST

ఈరోజు ఆదివారం కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో సండే ను ఫన్ డే గా ఎంతో ఆనందంగా గడుపుకుంటారు.ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చెయ్యగా ఈ సండే మరింత ఫన్ డే గా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.హౌస్ లో ఉన్న ఇద్దరిద్దరు ఒక్కో విధంగా చాలా ఫన్నీ గేమ్స్ తో కళ్ళకు గంతలు కట్టుకొని “బ్లైండ్ ఫోల్డ్”గా హౌస్ మేట్స్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండేలా లేదు.

అలా బిగ్ బాస్ మార్చేశారు.అందరివీ ఏమో కానీ శ్రీముఖి మరియు బాబాల మధ్య మాత్రం మంచి ఫన్ జెనరేట్ అయ్యింది.ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ ఇంత ఫన్ ప్లాన్ చేసాడు అంటే ఖచ్చితంగా దాన్ని మించే ఏదొక ట్విస్ట్ ఉంటుందని చెప్పాలి.దీనిని బట్టి డబుల్ ఎలిమినేషన్ పక్కానా అన్న సందేహం ఇప్పుడు కలుగుతుంది.మరి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా లేక డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అన్నది ఇంకాసేపు ఆగితే తెలిసిపోతుంది.