లేటెస్ట్ బజ్ : జెమినీ టీవీ వారు ఇచ్చే సర్ప్రైజ్ అదేనా..?

Wednesday, October 16th, 2019, 11:08:48 AM IST

తెలుగు టెలివిజన్ చరిత్రలో ఉన్న ఎన్నో ఛానెల్స్ లో టాప్ మోస్ట్ ఛానెళ్ల జాబితా వస్తే వాటిలో జెమినీ టీవీ ఛానెల్ కూడా ముందు వరుసలో ఉంటుంది.అయితే నిన్ననే జెమినీ ఛానెల్ వారు తమ టీమ్ నుంచి ఒక స్పెషల్ సర్ప్రైజ్ తమ వీక్షకుల కోసం రెడీగా ఉందని తెలిపారు.ఇంకొక ఐదు రోజుల్లో అదేంటో చెప్తామని నిన్న ప్రకటించారు.అయితే అదేంటో తెలీడానికి ఇంకా నాలుగు రోజులు ఉన్నా సరే ఇప్పుడే సోషల్ మీడియాలో దీనిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.దీనిపై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నా కొన్ని టాపిక్స్ మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.

ఎలాగో ఐదు రోజుల్లో అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి ఆ తేదీ 20వ తారీఖు వచ్చింది.అలాగే వీరు “సాహో” హక్కులను కొనుగోలు చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ వచ్చే ఆదివారం 20న సాహో టెలికాస్ట్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చి ఆ వచ్చే ఆదివారం 27 దీపావళి సందర్భంగా టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.అంతే కాకుండా సోషల్ మీడియాలో అయితే “RRR” హక్కులను కూడా వీరే కొనుగోలు చేసారని బాంబు పిలుస్తారేమో అని కొంత మంది అంటున్నారు.మరి రెండిట్లో ఎదో ఒకటా లేక వీటన్నిటిని మించే రేంజ్ సర్ప్రైజ్ ఏమన్నా వీరు ప్లాన్ చేసారా అన్నది చూడాలి.