బిగ్ బాస్ 3: రాహుల్ పై తనకున్న అబిప్రాయాన్ని పున్ను దాచేసిందా?

Thursday, September 19th, 2019, 04:23:25 PM IST

బిగ్ బాస్ 3 రియాలిటీ షో దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతుంది. తెలుగు లో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 సీజన్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ హౌస్ లో ప్రస్తుతం అందరి కళ్ళు పునర్నవి- రాహుల్ పైనే వున్నాయి. హౌస్ లో వీరి ప్రవర్తన రాను రాను మారిపోతుంది అని చెప్పొచ్చు. రోజుకో రకంగా ప్రవర్తించే పునర్నవి తన పై వస్తున్న గాసిప్ పై క్లారిటీ ఇచ్చేసింది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

హౌస్ లో గెలుపు కోసం ఆరాటపడే వారు చివరిలో తెలుస్తుంది. ఎనిమిది వారలు పూర్తయి తొమ్మిదో వారం లోకి అడుగుపెట్టిన ఈ కార్యక్రమం లో ఎలిమినేషన్ ప్రక్రియ అంతగా రక్తి కట్టించడం లేదు. కానీ ఎమోషన్స్, ఫన్నీ టాస్క్ లతో బిగ్ బాస్ ఆలా సరదాగా గడిచి పోతుంది, ఈ టాస్క్ లో భాగం గానే పునర్నవి వితికకి రాహుల్ పై అభిప్రాయాన్ని తెలియ జేసింది. లవర్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఒక కంప్లికేటెడ్ రెలేషన్షిప్ అంటూ పెద్ద బాంబు పేల్చింది. తికమకలో ప్రేక్షకులు వున్నా, మల్లి ఏదైనా టాస్క్ లో భాగంగా ముద్దు సీన్ చూడాల్సి వస్తే అపుడు ప్రజలేం అనుకోవాలో అర్ధం కావడం లేదు.