బ్రేకింగ్ న్యూస్ : ఈ వారం ‘ఆమె’ ఎలిమినేట్ ఖాయం

Saturday, September 14th, 2019, 12:56:44 PM IST

బిగ్ బాస్ హౌస్ లో వారం వారం హౌస్ నుండి ఒక్కో హౌస్ మేట్ ఎలిమినేట్ కావటం జరుగుతుంది. ఇప్పటికి ఏడు వారాల్లో ఒక్క వారం మినహా ప్రతి వారం ఒక్కో హౌస్ మేట్ ఎలిమినేట్ అయ్యాడు. గత వారం అలీ రెజా ఎలిమినేట్ కావటంతో అందరూ షాక్ అయ్యారు. ఎవరి ఊహించని విధంగా అలీని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. మరి ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఎలాంటి షాక్ ఇస్తాడో, ఎవరిని ఎలిమినేట్ చేస్తాడో అనే దాని గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావటానికి, పునర్నవి,శ్రీముఖి,హిమజ,శిల్ప,మహేష్ విట్టా నామినేట్ అయ్యి ఉన్నారు. శుక్రవారం వరకు జరిగిన ఓటింగ్ సరళిని, సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రేండింగ్ ని అనాలసిస్ చేస్తే శిల్ప చక్రవర్తి ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కవుగా ఉన్నట్లు తెలుస్తుంది. శిల్ప రెండు వారాల క్రితమే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

షో లో కాంటిస్టెండ్స్ విషయంలో ఆదరణ అంతంతమాత్రమే ఉండటంతో శిల్ప చక్రవర్తిని వైల్డ్ కార్డు ద్వారా లోపాలకి పంపించారు. కానీ ఆమె అనుకున్న స్థాయిలో గేమ్ అడగలేకపోతుంది. ఆమె రాక వలన ఎలాంటి లాభం లేదని తేలిపోయింది. ప్రేక్షకులు కూడా ఆమెని పట్టించుకోవటం లేదు. దీనితో ఆ ప్రభావం ఓట్లు మీద పడి ఆమెకి తక్కువ ఓట్లు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఏమైనా అలీ విషయంలో జరిగినట్లు అనుకోని సంఘటన జరిగితే తప్ప శిల్ప వెళ్ళిపోవటం దాదాపుగా ఖాయమనే చెప్పాలి.