షాకింగ్ : శ్రీముఖి పక్కా ప్లానింగ్ ప్రకారమే “బిగ్ బాస్” హౌస్ లోకి వెళ్లిందా..?

Thursday, August 22nd, 2019, 06:50:49 PM IST

టెలివిజన్ రంగంలో ఒక కొత్త షో క్లిక్ అవ్వాలి అంటే అది మామూలు విషయం కాదు.సరైన కంటెంట్ పక్కా ప్లానింగ్ ఉంటే తప్ప షోలు హిట్టవ్వవు.అలా అనేక ఎన్నో షోలు వచ్చినా సరే కేవలం కొన్నిటిని మాత్రమే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.అలా వచ్చి అతి తక్కువ సమయంలోనే అద్భుత ఆదరణను సంపాదించుకున్న షోలలో రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ కూడా ఒకటి.అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక 15 మంది సెలెబ్రెటీలు ఒకే ఇంట్లో మొత్తం 100 రోజులు ఉంటే ఎలా ఉంటుంది.

వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనే ఎన్నో రకాల కోణాల్లో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ షో విభిన్నమైన టాస్కులతో కొనసాగుతుంది.అయితే ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ బిగ్ బాస్ షో అనే టైటిల్ ను పొందాలని ఈ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు అనుకుంటారు.కానీ పక్కాగా తనకే రావాలి అని అనుకున్న వారు మాత్రం ముందు గానే పక్కా ప్లానింగ్ వెళ్తారు అని మరోసారి ఋజువు అవుతున్నట్టు అనిపిస్తుంది.

ఈ షోలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా ఉంది.ఈమె మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిగ్ బాస్ టైటిల్ తోనే రావాలని ముందుగానే నిశ్చయించుకుందో ఏమో కానీ ముందే ప్లానింగ్ వేసుకుంది.ఒక యాంకర్ గా ఈమెను అభిమానించే వారు పేస్ బుక్ లో చాలా గ్రూపులనే పెట్టుకున్నారు.అయితే అవన్నీ శ్రీముఖి బయట ఉన్నప్పుడంతా పెద్దగా యాక్టివ్ లో ఏం లేవు కానీ ఆమె ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్లడం ఖరారు అయ్యింది.

ఎంటర్ అయ్యింది అనగానే అప్పటి నుంచి అన్ని గ్రూపులలోను శ్రీముఖి మీద పోస్టులు పడుతున్నాయి.ఆమెను ఎలా అయినా గెలిపించుకోవాలని అంటున్నారు.ఇదంతా చూస్తుంటే పక్కా ప్రీ ప్లాన్డ్ అనే చెప్పాలి.ముందు అంతా గుర్తు రాని అభిమానం ఇలా బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాతే అందరికి ఎందుకు గుర్తొచ్చిందో మరి..?