ఇట్స్ ఆఫీసియల్ : బన్నీ సినిమా ఆగిపోయింది..!

Wednesday, February 26th, 2020, 08:02:18 AM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” గత నెల సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.అలాగే ఇన్ని రోజులు గడుస్తున్నా సరే ఈ చిత్రం హవా థియేటర్స్ లో ఏమాత్రం తగ్గడం లేదని చెప్పాలి.అయితే ఈ చిత్రం ఓ పక్క థియేటర్స్ లో ఉండగానే మరోపక్క డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేస్తున్నామని చెప్పి సన్ నెక్స్ట్ వారు షాకిచ్చారు.

మొదట కాస్త రచ్చ నడిచినా తర్వాత ఈ వెర్షన్ కోసం కూడా చాలా మందే ఎదురు చూసారు.కానీ మరికొంత మంది మాత్రం ఇంత త్వరగా ఈ చిత్రం స్ట్రీమింగ్ వెర్షన్ లో రావడం ఇష్టపడలేదు.ఇంత బాగా ఆడుతున్న సినిమాను కనీసం 50 రోజులు కూడా థియేటర్స్ లో ఆడకుండా ఎలా విడుదల చేస్తారని చిత్ర యూనిట్ మీదనే పలు విమర్శలు రావడంతో సన్ నెక్స్ట్ వారు నిన్నటి వరకు చిన్న డైలమా ను మైంటైన్ చేసినా “అల వైకుంఠపురములో” స్ట్రీమింగ్ వెర్షన్ ను వాయిదా వేసినట్టుగా వారి పోస్టులతో చెప్పకనే చెప్పేసారు.సో ఇంకొన్ని రోజుల తర్వాత ఈ చిత్రాన్ని సన్ నెక్స్ట్ లో మనం ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు.