ఇక యాంకర్ గా సుమ బ్రేక్ తీసుకోవాల్సిందేనా..ఎందుకు?

Wednesday, December 11th, 2019, 02:38:33 PM IST

ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే మొదలు కావాల్సింది ఒక్క అడుగుతోనే అలాగే ఒక పెద్ద ఈవెంట్ కానీ ప్రోగ్రాం కానీ సక్సెస్ ఫుల్ గా రన్ కావాలంటే దానిని నడిపించే ఒక సరైన వ్యక్తి స్టేజ్ పై తప్పకుండా ఉండాలి అలా ఎన్నో భారీ ఈవెంట్లను షోలను ప్రోగ్రాంలను ముందుండి నడిపించిన మహిళా వ్యాఖ్యాతగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా యాంకర్ సుమ అనే చెప్పాలి.ఆమె వ్యాఖ్యాతగా ఎన్నో షోలు ఈవెంట్లు చేసారు.ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.కానీ ప్రతీ దానికి ఒక ముగింపు ఉంటుంది.

అలాగే కాలంతో పాటు అన్ని మారాలి అన్నట్టుగా ఇప్పుడిప్పుడే సుమపై ఎందుకో చిన్నగా నెగిటివిటి అని చెప్పలేం కానీ ప్రేక్షకుల్లో చిన్నపాటి ఆలోచన మొదలయ్యింది.ప్రతీ ఛానెల్ వారు ఆమె తోనే కొత్త కొత్త షోలు అన్ని ప్రారంభించడం వంటివి చేస్తుండడంతో ఇంకెంత కాలం ఈమెనే చూడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు.తాజాగా స్టార్ మా ఛానెల్లో స్టార్ట్ చెయ్యబోతున్న “వైఫ్ చేతిలో లైఫ్” అనే సరికొత్త ప్రోగ్రాంను ప్రారంభించబోతున్నారు.దానికి గాను నెటిజన్స్ అంటున్నారు.కొత్తవాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి అంటూ కామెంట్ చేస్తున్నారు.మరి ఇలాంటివి అన్ని ఇంకా సుమ వరకు చేరాయో లేదో తెలియాలి.