జబర్దస్త్ లో ఈ గురువారం సందడి మాములుగా లేదండోయ్య్

Friday, July 19th, 2019, 01:11:41 PM IST

ప్రతి గురువారం తెలుగింటిలో సందడి చేసే జబర్దస్త్ షో, ఈ గురువారం మరింత ఫుల్ జోష్ తో మన ముందుకి వచ్చింది. ఈ ఎపిసోడ్ లో రాకెట్ రాఘవ చేసిన స్క్రిప్ట్ అయితే సూపర్ అనే చెప్పాలి. దేవుడి దిగివస్తే జనాలు ఎలాంటి కోరికలు కోరుతారు, వాటిని నెరవేర్చటంలో దేవుడు పడే పాట్లు భలే ఆసక్తిగా చూపించారు. ముఖ్యంగా శాంత కుమార్ ఎంట్రీ సాంగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి.

అలాగే వెంకీ-మంకీ చేసిన స్క్రిప్ట్ కూడా సూపర్ ఫన్ ని జనరేట్ చేసింది. ఈ స్క్రిప్ట్ లో జీవన్ పాత్ర హైలైట్ అని చెప్పాలి. తనదైన టైమింగ్ తో స్క్రిప్ట్ ని అలా అలా పైకి తీసుకోని వెళ్ళాడు. అలాగే అతనికి వెంకీ కూడా మంచి సపోర్ట్ అందించాడు. ఇక జబర్దస్త్ షో కి ప్రధాన ఆకర్షణ గా నిలిచే హైపర్ ఆది స్క్రిప్ట్ కూడా ఈ వారం అదిరిపోయే పంచులతో అలరించింది. ప్రతి వారం ఎపిసోడ్ కి ఒక్కో లేడిని తీసుకోని వస్తున్నా ఆది ఈ వారం కూడా ఒకరిని తీసుకొనివచ్చాడు.

ఇక రాకింగ్ రాకేష్ చేసిన స్క్రిప్ట్ కూడా వన్ అఫ్ ది హైలైట్ అనే చెప్పవచ్చు. అలాగే అదిరే అభి స్క్రిప్ట్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా అనసూయతో కలిసి తేజ చేసిన అయితే ఒక రేంజులో ఉందని చెప్పాలి. ఇలా ఐదు టీమ్స్ కూడా అదిరిపోయే కామెడీ స్క్రిప్ట్ తో నవ్వించారు ఇంకా ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్కేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి