ఆ ముగ్గురు జబర్డస్త్ నటులే..ఒకేసారి ఇలా..!

Friday, September 20th, 2019, 05:04:25 PM IST

జబర్దస్త్ షోకి ఉన్న పాపులారిటీ గురించి అందరికి బాగా తెలుసు. ఏడేళ్ల నుండి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జబర్దస్త్ షో వలన అనేక మంది యువ నటులు బుల్లితెరపై అటు నుండి వెండితెరకి పరిచయమవుతున్నారు. ఈ షో వలన సాధారణ నటులు కూడా సెలెబ్రటీస్ గా మారిపోతున్నారు. తాజాగా ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన నటులు హీరోలుగా మారిపోతున్నారు.

ఇందులో సుడిగాలి సుధీర్ ముందు వరుసలో ఉన్నాడు. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ లతో కలిసి స్క్రిప్ట్ చేసే సుధీర్ హీరోగా మరి “సాప్ట్‌వేర్ సుధీర్‌” అనే సినిమాతో అభిమానులను అలరించనున్నాడు. మరో కమెడియన్ చమ్మక్ చంద్ర :రామ సక్కనోళ్లు: సినిమా ద్వారా హీరో అయ్యాడు. రంగస్థలం ఫేమ్ మహేష్ ఆచంట నేను నాగార్జున అని మనముందుకు రాబోతున్నాడు. ఇందులో సుధీర్, చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో కొనసాగుతూనే ఉన్నారు.

వీళ్ళే కాకుండా షకలక శంకర్ ధన్ రాజ్ కూడా హీరోలుగా మెరిసిన వాళ్లే, అంటే కాకుండా రాకెట్ రాఘవ, హైపర్ ఆది, అదిరే అభి లాంటి వాళ్ళు సినిమాలో రాణిస్తున్నారు. అదే విధంగా ఈ మధ్య వస్తున్నా చిన్న చిన్న లో ఎక్కువగా కామెడీ ట్రాక్స్ కోసం జబర్దస్త్ నటులనే తీసుకుంటున్నారు. కామెడీ వరకు అయితే పర్వాలేదు. హీరోలుగా వెళ్తున్న వాళ్ళని ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.