సరికొత్త స్క్రిప్ట్ తో అదరకొట్టిన రాఘవ..హర్రర్ కామెడీ అదిరిపోయింది.

Friday, September 20th, 2019, 03:50:47 PM IST

జబర్దస్త్ షో గురించి కొత్తగా పరిచయం చేసే అవసరమే లేదు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ జబర్దస్త్ గురించి చర్చ తప్పకుండా జరుగుతుంది. ప్రతి గురువారం, శుక్రవారం జబర్దస్త్ కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూస్తారని చెప్పటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అంత పాపులర్ అయ్యింది ఈ షో , ఇక తాజాగా వచ్చేవారానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు

ఇందులో హైపర్ ఆది గురించి వేరేగా చెప్పేపని లేదు. నాన్-స్టాప్ పంచులతో పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్విస్తూనే ఉంటాడు. ఇక ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది రాకెట్ రాఘవ గురించి, ఎప్పటికప్పుడు విన్నూతమైన స్క్రిప్ట్స్ వేస్తూ అలరించే రాఘవ ఈ వారం సరికొత్త స్క్రిప్ట్ తో అలరించాడు. దెయ్యాలు ఇంట్లో ఒక దొంగ ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అనే దానిని ఫన్నీ గా చూపించాడు. అలాగే ఇందులో ఎలాంటి డైలాగులు లేకుండా అంత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో స్క్రిప్ట్ మొత్తాన్ని నడిపించాడు.

గతంలో కూడా రాఘవ ఇలాంటి విన్నూతమైన స్క్రిప్ట్స్ చాలానే చేశాడు. ఎటువంటి డైలాగులు లేకుండా కేవలం తన పేస్ ఎక్సప్రెషన్స్ తో కడుపుబ్బా నవ్వించే సత్తా రాఘవకి పుష్కలంగా ఉంది. అదే కోవలోనే వచ్చే వారం ప్రసారం కాబోయే స్క్రిప్ట్ కూడా ఉంటుంది. అప్పటిదాకా ఈ ప్రోమో చూసి కాసేపు నవ్వుకోండి

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.