బిగ్ బాస్ 3 : బాబా భాస్కర్ కోసం భావోద్వేగానికి గురైన జాఫర్…

Tuesday, August 20th, 2019, 08:40:04 PM IST

బిగ్ బాస్ 3… ఈ మూడవ సీజన్ ప్రారంభమైనప్పటినుండి కూడా కంటెస్టెంట్ల మాట ఏమో కానీ ప్రేక్షకులకు మాత్రం చాలా కన్నుల విందుగా ఉందని చెప్పాలి… ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే మాత్రం ఆ ఇంటిలో ఎవరు కూడా ఎవరికీ మద్దతుగా లేకపోవడమే కాకుండా ఒక్కరిపైనా ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ చాలా గొడవ పడుతున్నారని చెప్పాలి. కాగా ఇప్పటివరకు కూడా ఈ హౌస్ నుండి నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వగా తరువాత వారానికి కూడా ఇక నామినేషన్లు ప్రారంభం చేశారు వీళ్ళు… ఈసారి మాత్రం అందరు కూడా బాబా భాస్కర్ ని టార్గెట్ చేశారని చెప్పాలి… కాగా కొన్ని కారణాల వలన బాబా భాస్కర్ కన్నీటిపర్యంతం అయ్యాడని స్పష్టంగా అర్థమవుతుంది.

కాగా ప్రస్తుతానికి హౌస్ కి కెప్టెన్ గా అలీ ఉన్నారు. ఈమేరకు అలీ నామినేషన్ ని చేసింది మాత్రం బాబా భాస్కర్ ని… ఈమేరకు బాబా భాస్కర్ కోసం కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. “మీరు గేమ్‌ని సీరియస్ తీసుకోవడంలేదని.. నటిస్తున్నట్టుగా అనిపిస్తుంది? అందరితో మంచి అనిపించుకోవడానికి నిజాయితీగా గేమ్ ఆడటం లేదని” ఆరోపణలు గుప్పించారు. అయితే బాబా భాస్కర్ అందరిని నవ్వించడాన్ని కూడా అలీ తప్పు పడుతూ, అందుకే బాబా భాస్కర్ ని నామినేషన్ చేశారు. అయితే అలీ చేసిన వాఖ్యలపై బాబా భాస్కర్ చాలా సీరియస్ గా తీసుకోని శ్రీముఖి దగ్గర మాట్లాడుతూ… నేను ఏం చేశాను? నవ్వుతూ.. నవ్విస్తూ ఉండటం తప్పా… అంటూ ఒక చిన్న పిల్లాడిలా ఏడ్చారు.

అయితే బాబా భాస్కర్ ఆలా కన్నీరు పెట్టుకోవడం చూసి ఈ హఫుసే నుండి ఎలిమినేట్ అయిన జాఫర్, బాబా భాస్కర్ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయారు. ఈమేరకు ఒక పోస్టు ను కూడా పెట్టేశారు. ఈ పోస్టులో అలికి సంబంధించి కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. “యుద్ధంలో గెలవడమే ముఖ్యం కాదు . ఎలా గెలిచామనేది కూడా ముఖ్యం . బిగ్ బాస్ హౌస్‌లో అలీ అట ఫెయిర్‌గా లేదు . రాలిన ఆ కన్నీటి చుక్కలకు తన అంతరాత్మకైనా జవాబివ్వాలి” అంటూ బాబా భాస్కర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.