రోజాకు జాఫర్ మైండ్ బ్లోయింగ్ ప్రశ్న.. ఆ ఈవెంట్ చూడాల్సిందే..!

Saturday, December 14th, 2019, 10:38:54 PM IST

న్యూ ఇయర్ అంటే అందరికి గుర్తొచ్చేది పార్టీలు, పబ్బులు, డ్యాన్సులు, ఈవెంట్‌లు. అయితే ఎప్పటిలాగానే మీ అందరి కోసం 2020 ఇయర్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ మీకు మరింత ఎంటర్‌టైన్ అందించేందుకు ఈ సారి కూడా మల్లెమాల ప్రొడక్షన్స్ వారు ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే అంటూ సరికొత్త ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

అయితే దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌లో వైసీపీ ఎమ్మెల్యే రోజాను జాఫర్ ఇంటర్వ్యూ చేస్తూ ఓ సీరియస్ పొలిటికల్ ప్రశ్న వేశాడు. రోజా గారు మీరు టీవీ షోలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు, జనాల కోసం తక్కువ సమయం ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇది వాస్తవమా కాదా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ షాక్‌కి గురయ్యారు. అయితే జాఫర్ అడిగిన ప్రశ్నకు రోజా ఎలాంటి సమాధానం చెప్పిందనేది మాత్రం ప్రోమోలో చూపించలేదు. అయితే జాఫర్ అడిగిన ప్రశ్నకు రోజా ఏం సమాధానం చెప్పింది, అసలు ఇంకా జాఫర్ ఆమెను ఏమేమి ప్రశ్నలు అడిగాడనేది తెలియాలంటే మాత్రం డిసెంబర్ 31 రాత్రి 9:30 నిమిషాలకు ఈటీవీలో రాబోతున్న ఆడవారి పార్టీలకి అర్ధాలే వేరులే కార్యక్రమాన్ని తప్పక చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి