“కల్కి” దశావతారి… టెలివిజన్ లో అయినా అదరగొడతాడా?

Tuesday, September 17th, 2019, 11:45:32 AM IST

రాజశేఖర్ హీరోగా తొలినాళ్లలో ప్రజల అదరణని పొందినా , ప్రస్తుతం కుర్ర హీరోలతో పోటీ పడలేక, తమ వయసుకు తగ్గ కథలు దొరక్కా నానా ఇబ్బందులు పడుతున్నారు. కల్కి చిత్రం ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ఆడలేక అందరిని నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈ చిత్రం టెలివిజన్ లో తన అదృష్టాన్ని పరీక్షించనుంది.

చాల సినిమాలు థియేటర్లలో ఆడనప్పటికీ టీవీ లో మాత్రం చాల హడావిడి చేస్తాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్ల వద్దకు రప్పించుట లో విఫలమైన, టీవీ లో ప్రసారమయ్యేపుడు అందరిని అలరిస్తాయి. కల్కి కథాంశం బావున్నప్పటికీ సినిమా అంతగా ఆడలేదు. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో కల్కి ప్రసారం కానుంది. మరి ఈ చిత్రం టీవీ ప్రేక్షకుల్ని అలరించుటలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి