ఆ సినిమా చూసి కుళ్ళుకున్న కళ్యాణ్ రామ్.!

Tuesday, January 14th, 2020, 02:54:38 PM IST

ప్రముఖ సినీ కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం ఎంత పాపులరో అందరికీ తెలిసిందే.ఈసారి సంక్రాంతి కానుకగా నందమూరి హీరో నటిస్తున్న “ఎంత మంచివాడవురా” చిత్రం విడుదల సందర్భంగా ఈ షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.

లా వచ్చి తాను నటించిన చిత్రం కోసం మరియు తమ కుటుంబం కోసం చాలా విషయాలను వెల్లడించారు.అయితే తాను తన తమ్ముడు తారక్ అలాగే బాబాయ్ నందమూరి బాల కృష్ణలతో ఒక సినిమా చెయ్యాల్సొస్తే అన్న టాపిక్ వచ్చినప్పుడు కళ్యాణ్ రామ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.

మా ముగ్గురం అంటే ఆ సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో ఉంది అని కానీ ఓ సినిమా చూసిన తర్వాత చాలా ఈర్ష్య పడ్డానని తెలిపారు.అదే అక్కినేని కుటుంబం మరియు వారి అభిమానులు జీవితంలో మర్చిపోలేని చిత్రం “మనం” సినిమా అని చెప్పాలి.అలాంటి సినిమా చేస్తే బాగుండు అని అప్పుడు ఆ సినిమా చూసి ఒకరకమైన జెలసీ ఫీల్ అయ్యానని కళ్యాణ్ రామ్ తెలిపారు.

ఫుల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి