తారక్ ను”నాన్న” అంటూ ఏడిపించేసిన కళ్యాణ్ రామ్.!

Monday, January 13th, 2020, 10:06:08 AM IST

నందమూరి కుటుంబం అన్నా ఆ హీరోలు అన్నా సరే ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు.అలా ఎన్నో దశాబ్దాల పాటుగా తెలుగు ప్రేక్షలుకుల్లో వారంటే ఒక ఎమోషనల్ బంధం వారికీ వీరికీ ఏర్పడిపోయింది.అలాగే వారై కుటుంబంలో జరిగినటువంటి విషాదం మరే ఇతర కుటుంబంలో కూడా జరగకూడదని తమ అభిమానులకు తగు జాగ్రత్తలు చెప్తూ వారిపై ఉన్న ప్రేమను అటు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు చూపించారు.

అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అది ఎమోషనల్ గా ఎంత బలంగా ఉందో ఆలీ షో ద్వారా ఇప్పుడు ప్రతీ ఒక్క నందమూరి అభిమానికి తెలిసింది.ఈటీవీలో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం కు కళ్యాణ్ రామ్ సంక్రాంతి ముఖ్య అతిధిగా వచ్చారు.అలా వచ్చిన ఎపిసోడ్ ఈరోజు సోమవారం రాత్రి టెలికాస్ట్ కానుండగా దానికి సంబంధించిన రెండో ప్రోమోను విడుదల చేసారు.ఇందులో ఆలీ అడిగిన ఓ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ కంటతడి పెట్టించేంత పని చేసారు.

తారక్ తనని ఎప్పుడు అన్న అంటాడు కానీ మీరు మాత్రం నాన్న అంటారు అని ఆలీ అడగ్గా అది నాకు ముందు నుంచీ అంతే తారక్ ను ఎప్పుడూ ఒక తమ్ముడిగా నేను అనుకోలేదు.నాన్న అనే నాకు వస్తుంది అని అన్నపుడు నాన్న లేని లోటు తమ్ముడు తీర్చాడు అన్నప్పుడు చూపించిన ఎమోషనల్ ఫ్రేమ్స్ ఒక్క నందమూరి అభిమానులనే కాకుండా ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించేలా అనిపిస్తుంది.ఈ ఫుల్ ఎపిసోడ్ ఈ రోజు సోమవారం రాత్రి మీ ఈటీవీలో ప్రసారం కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి