“ఆదిత్య 369” పై ఎవరికీ తెలీని రహస్యం చెప్పిన కళ్యాణ్ రామ్.!

Tuesday, January 14th, 2020, 11:44:34 AM IST

ఈ సంక్రాంతి రేస్ లో ఉన్నటువంటి చిత్రాల్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన “ఎంత మంచివాడవురా” చిత్రం కూడా ఒకటి.అయితే ఏ చిత్రం తాలుకా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ప్రముఖ సినీ కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా చేసే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం కు ఈ సంక్రాంతి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.

అలా వచ్చిన కళ్యాణ్ రామ్ అనేక విషయాలను పంచుకున్నారు.అలా అలీతో మాట్లాడుతుండగా పెద్ద ఎన్టీఆర్ నుంచి బాలయ్య వరకు తనకి నచ్చిన సినిమాల టాపిక్ వచ్చినపుడు కళ్యాణ్ తాత గురై సినిమాల్లో అయితే “పాతాళ భైరవి” చిత్రం అంటే చాలా ఇష్టం అని అలాగే బాబాయ్ నటించిన చిత్రాల్లో అయితే “ఆదిత్య 369” చిత్రం ఎంతో ఇష్టమని తెలిపారు.

అలా చెప్తూ ఆ చిత్రానికి సంబంధించిన ఒక రహస్యాన్ని కూడా చెప్పారు.ఆ చిత్రంలో హీరోగా నటించినప్పుడు మొట్టమొదటి సారిగా అసలు మేకప్ అనేదే వేసుకోకుండా బాలకృష్ణ ఆ చిత్రంలో నటించారని ఇప్పటి వరకు ఎవరికీ తెలీని సీక్రెట్ ను కళ్యాణ్ రామ్ చెప్పారు.ఇది విని ఆలీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.