ఓంకార్ షోకు ఈ దెబ్బతో కొత్త టీఆర్పీ వస్తుందా.?

Saturday, February 15th, 2020, 09:32:54 AM IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఉన్న మేల్ యాంకర్స్ లో ఓంకార్ కు ఉన్న పేరు గురించి మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు.ఒక పక్క సినిమాలు మరోపక్క అదిరిపోయే షోలతో ఓంకార్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.అలా స్టార్ మా లో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ను రీప్లేస్ చేస్తూ “సిక్స్త్ సెన్స్” అని ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసారు.ఇది కూడా ఇప్పుడు మూడు సీజన్లను పూర్తి చేసుకోబోతుంది.

అయితే ఈ షో తర్వాత ఇంకో షోను కూడా ఓంకార్ లైన్ లో పెట్టేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.అలాగే ఇదే స్టార్ మా లో ప్రసారం అయ్యే అన్ని సీరియల్స్ లో కంటే కూడా “కార్తీకదీపం” సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు.ప్రతీ ఎపిసోడ్ కూడా రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది అలాగే ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ఇద్దరు పిల్లలు అమృత మరియు కృతికలతో ఓ ఎపిసోడ్ ను ప్లాన్ చేసారు.దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చెయ్యగా స్టార్ మా నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన ఇతర ప్రోమోల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.మరి వీరి రాక ఈ ఎపిసోడ్ కు ఎంత టీఆర్పీను రాబడుతుందో చూడాలి.