అమెజాన్ ప్రైమ్ కు షాకిచ్చిన కీర్తి సురేష్ కొత్త సినిమా.!

Saturday, July 11th, 2020, 09:54:16 AM IST

ప్రస్తుతం లాక్ డౌన్ మూలాన పలు మీడియం మీడియం బడ్జెట్ సినిమాలు నేరుగా ఓటీటీ ప్లాట్ ఫాం లో విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ చిత్రం “పెంగ్విన్” డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలై ఊహించని స్పందనను రాబట్టుకుంది.

కంటెంట్ ఫెయిల్ అయిన సినిమాపై అంచనాలు ఉండటంతో ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం సూపర్ హిట్ అనే చెప్పాలి. అయితే ఈ చిత్రంతో పాటు కీర్తి సురేష్ నటించిన మరో లేటెస్ట్ చిత్రం “మిస్ ఇండియా” కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల కానుంది అని రూమర్స్ వినిపించాయి.

అందుకు తగ్గట్టుగానే వారు భారీ ధరనే ఇచ్చారట. కానీ ముందు ఒప్పుకొని ఇప్పుడు కీర్తి సినిమా మేకర్స్ అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మబోమని చెప్తున్నారట. ఈ చిత్రాన్ని తరువాత నేరుగా థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.