“కేజీయఫ్” కోసం గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారే..!

Saturday, July 4th, 2020, 10:48:05 AM IST

మొత్తం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే “కేజీయఫ్” అనే ఓ సినిమాకు బ్రాండ్ అలా పడిపోయింది. విడుదలకు ముందు భారీ హైప్ తీలుకొచ్చే ప్రయత్నాలు చేసిన వీరి టీమ్ ను చూసి చాలా మంది ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే సినిమాలో విషయం ఏమీ ఉండదని అనేక విమర్శలు చేసారు.

కానీ సీన్ కట్ చేస్తే విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టించింది. దీనితో ఈ చిత్రం ఒక్కసారిగా ఇండియన్ బాక్సాపిఫ్ వద్ద హాట్ టాపిక్ అయ్యిపోయింది. ఇదిలా ఉండగా వెండితెరపై ఎన్నో వండర్స్ సృష్టించిన ఈ చిత్రం బుల్లితెర మీద ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూశారు.

కానీ అందుకు చాలా సమయాన్నే తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మన దగ్గర స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యడానికి రంగం సిద్ధం చేశారు. ఇపుడు దీనికి కూడా మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేసినట్టిన్నారని చెప్పాలి.

ఎందుకంటే మొదట నిర్మాతలు ఈ సినిమాను ప్రమోషన్స్ మొదలుపెట్టగా హీరో రాకింగ్ స్టార్ యాష్ తో తెలుగు లో మాట్లాడించి మరీ వీడియో పెట్టారు. దీనితో తెలుగు స్మాల్ స్క్రీన్ పై కూడా ఈ చిత్రాన్ని గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారని చెప్పాలి.