మీకు కాదు.. ప్రదీప్‌కి మాత్రమే చెబుతాం.. ఏంటో తెలుసా..!

Friday, October 18th, 2019, 10:37:19 PM IST

జీ తెలుగులో వస్తున్న కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా కార్యక్రమం మంచి పీఆర్పీ రేటును సొంతం చేసుకుని ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుని నాలుగో సీజన్‌లో కూడా దూసుకుపోతుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రదీప్ మాచిరాజ్ యాంకర్‌గా చేస్తుండడం నిజంగా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. షోకి వచ్చిన సెలబ్రెటీలతో వారి లైఫ్‌లో జరిగిన సన్నివేశాలు, వారి అల్లరి చేష్టల వంటి అసలు నిజాలు చెప్పించడం అది ప్రదీప్‌కే సాధ్యం. అయితే ప్రతి శనివారం ఒక కొత్త సెలబ్రెటీతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని అలరిస్తూ వస్తుంది ఈ కార్యక్రమం.

అయితే ఈ సీజన్‌లో ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ టీమ్, అమలాపాల్, రష్మిక మందన్నలు, అనుపమ పరమేశ్వరన్, రకుల్ ప్రీత్, రెజీనా, అడివి శేషు, కార్తికేయ, పాయల్ రాజ్‌పూత్‌, శివాత్మిక, ఆనంద్ దేవరకొండలు, విశ్వక్‌సేన్, వరుణ్ తేజ్, దర్శకుడు హరీశ్ శంకర్, సూర్యా, సయ్యేషా, హన్సిక, సందీప్ కిషన్‌లు రాగా గత వారం దర్శకుడు, యాంకర్ ఓంకార్ మరియు అవికాగోర్, అశ్విన్‌లు వచ్చి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. అయితే ఈ వారం ప్రదీప్‌తో టచ్‌లోకి వచ్చి మరింత ఎంటర్టైన్మెంట్‌ను అందించేందుకు తరుణ్ భాస్కర్, ప్రియదర్శి లు విచ్చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో విడుదలయ్యింది. అయితే షోలో ప్రియదర్శి చేసిన సందడి మామూలుగా లేదనే చెప్పాలి. అయితే ఆయన కాలేజ్ డేస్ గురుంచి, ప్రదీప్‌తో పంచుచుకున్న మరిన్ని విషయాలను గురుంచి తెలియాలంటే మాత్రం ఈ శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగును చూడడం మాత్రం మిస్సవకండి మరీ.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి