మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న చిరు కొరటాల ప్రాజెక్ట్.!?

Saturday, December 14th, 2019, 04:17:33 PM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం “సైరా” నరసింహా రెడ్డి.ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.కానీ ఇప్పటికీ ఈ చిత్రం షూటింగ్ మొదలు కాకపోవడం అభిమానుల్లో కాస్త నిరాశ పరిచింది.కానీ ఈ చిత్రానికి సంబంధించి బయటకు వచ్చిన ఏ చిన్న వార్త అయినా సరే పెద్ద ఎత్తున సెన్సేషన్ అవుతుంది.అయితే ఇప్పుడిప్పుడే చిత్రం సెట్ వర్క్ కూడా మొదలవుతుందని కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఈ చిత్రం ఇప్పుడు బాగా లేట్ కావడంతో అభిమానుల్లో ఒక అభిప్రాయం వస్తుంది.ఈ చిత్రాన్ని కాస్త త్వరగా మొదలు పెట్టి ఉన్నట్టయితే వచ్చే ఏడాది వేసవి కల్లా తప్పకుండా పూర్తి చేసేవాళ్ళని అలా చేసి ఉంటే వేసవిలో చిత్రానికి మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉండేది అని అలాంటి ఛాన్స్ ను చిత్ర యూనిట్ మిస్ చేసుకున్నారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.ఏది ఏమైనప్పటికి మాత్రం మణిశర్మ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు మెగాస్టార్ గ్రేస్ కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.