నెట్ ఫ్లిక్స్ లో హిట్టయిన ఈ సినిమా ఇక నుంచి ఈ యాప్ లో కూడా.!

Wednesday, July 1st, 2020, 10:47:26 AM IST

ప్రస్తుతం మన దగ్గర ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలలో పలు మీడియం బడ్జెట్ చిత్రాలు డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోకి వచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా సిద్దూ జొన్నల గడ్డ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ మరియు సీరత్ కపూర్ లు హీరోయిన్ లుగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “కృష్ణ అండ్ హిస్ లీల”.

అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం గత కొన్ని రోజుల క్రితం నేరుగా స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్ లో విడుదలై ప్రతీ ఒక్కరి నుంచి సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు మరో స్ట్రీమింగ్ యాప్ లోకి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

మన తెలుగు మొట్టమొదటి స్ట్రీమింగ్ యాప్ “ఆహా” వారు ఈ చిత్రాన్ని ఈ జూలై 4 న డిజిటల్ ప్రీమియర్ గా అందుబాటులోకి తీసుకురానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఈ చిత్రం ఇక నుంచి ఈ రెండు డిజిటల్ యాప్స్ లో అందుబాటులో ఉండనుంది.