బిగ్ అప్డేట్ : జబర్దస్త్ కోరికని, కొత్త షో అయినా నెరవేరుస్తుందా…?

Monday, December 16th, 2019, 01:23:19 PM IST

మెగా బ్రదర్ నాగబాబు గత కొద్దీ రోజులుగా జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వలన ఆ కార్యక్రమం నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే ఆయన సరాసరి జబర్దస్థ్ నుండి వెళ్ళిపోయాక, జీ తెలుగు వారు నిర్వహిస్తున్నటువంటి మరో కార్యక్రమంలో జడ్జి గా వ్యవహరించడానికి వెళ్లిపోయారు. అయితే గత 7 ఏళ్లుగా జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి నాగబాబు అకస్మాత్తుగా ఎందుకు వెళ్లిపోయారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా కేవలం పారితోషకం విషయంలో గొడవ జరిగిన కారణంగానే నాగబాబు జబర్దస్త్ మానేశారని పుకార్లు ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తున్నాయి.

అయితే జబర్దస్త్ మానేసిన తరువాత నాగబాబు మాట్లాడుతూ… ఓకే సందర్భంలో మాట్లాడుతూ… తన స్థాయికి సరిపోయే పారితోషకం కానప్పటికీ కూడా ‘జబర్దస్త్’ కామెడీ షోలో చేశానని, అయినప్పటికీ కూడా అక్కడ వారు ఇప్పటికి అదే పంథా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అయితే జబర్డస్త్ లో ఆయనకి నెలకు 15 లక్షలు ఇస్తున్నారని, కానీ జీ తెలుగు వారు అంతకి డబుల్ పారితోషకం ఇస్తామని చెప్పి, నాగబాబు గారి స్థాయికి సరిపోయే విధంగా పారితోషకం ఇస్తామని నెలకి 30 లక్షల రూపాయలను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం.