బన్నీ టీజర్ కు గట్టిగానే దెబ్బేసిన మహేష్ ఫ్యాన్స్.!

Wednesday, December 11th, 2019, 05:55:14 PM IST

2020 సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు ఉన్నాయి అన్నప్పుడే ఆ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలయ్యిపోయింది.వారి కోసం పరిచయాలు అక్కర్లేదు కూడా.అల వైకుంఠపురములో మరియు సరిలేరు నీకెవ్వరు ఈ రెండు చిత్రాలు ఎప్పుడైతే తమ విడుదల తేదీలను ప్రకటించారో అప్పటి నుంచీ ఫ్యాన్ వార్స్ మరింత ఎక్కువయ్యిపోయాయి.అలా ఇండస్ట్రీలో ఈ రెండు చిత్రాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటే మరో పక్క ఆన్లైన్ లో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఒరిజినల్ వారే నడుస్తుంది.దానితో ఒకరి చిత్రంపై ఒకరు బాగా హేటెర్డ్ పెంచేసుకున్నారు.

ఇప్పుడు అదే “అల వైకుంఠపురములో” టీజర్ విషయంలో బాగా ప్రూవ్ అయ్యిందని చెప్పాలి.మహేష్ టీజర్ ముందు వచ్చేయడం ఆ తర్వాత బన్నీ టీజర్ రావడానికి గ్యాప్ ఎక్కువే ఉండడంతో వీరి పిల్ల ఫ్యాన్ వార్స్ మరింత పెరిగి చివరకు “అల వైకుంఠపురములో”కు దెబ్బేసేలా చేసింది.ఇప్పటి వరకు సరిలేరు నీకెవ్వరు టీజర్ కు 35 వేలు డిస్ లైక్స్ మాత్రమే రాగా “అల వైకుంఠపురములో”టీజర్ కు మాత్రం కేవలం గంటలోనే 20 వేలకు పైగా డిస్ లైక్స్ వచ్చి పడ్డాయి.ఇది ఖచ్చితంగా మహేష్ ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్టే అని చెప్పాలి.మరి వీరు ఎందుకు ఇంతలా కక్ష పెట్టేసుకున్నారో వారికే తెలియాలి.ఏది ఏమైనా మాత్రం ఈ ఫ్యాన్ వార్స్ మాత్రం ఎప్పటికీ ఆగవు.