మొదటిసారి ఆ ఘనత సాధించిన మహేష్ విట్టా

Friday, September 20th, 2019, 11:30:25 AM IST

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ టాక్ లో భాగంగా బాబా భాస్కర్, మహేష్ విట్టా ఇద్దరు కూడా పోటీ పడ్డారు. అంతకుముందు జరిగిన టాస్క్ లో లెక్చరర్స్ టీం నుండి బాబా భాస్కర్, స్టూడెంట్స్ టీం నుండి మహేష్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. దీనితో ఈ వారం ఇద్దరు కెప్టెన్సీ కోసం పోటీదారులు అయ్యారు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరికి పూల దండాలు ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ ఇద్దరు పోటీదారులు మిగిలిన హౌస్ మేట్స్ తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి, వాళ్ళ మద్దతు తీసుకోవాలి. హౌస్ మేట్స్ ఎవరిని అయితే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఆ దండాలు మెడలో వేస్తారు. ఎండ్ బజార్ మోగే సమయానికి ఎవరి మెడలో అయితే ఎక్కువ దండాలు వుంటాయో వాళ్ళు ఈ వారం కెప్టెన్ అయ్యినట్లు. ఇందులో ఎండ్ బజార్ మోగే సమయానికి మహేష్ కి ఎక్కువ దండాలు ఉండటంతో అతను కెప్టెన్ అయ్యాడు.

ఇందులో హిమజ,వరుణ్ సందేశ్,రాహుల్,శివజ్యోతి, రవికృష్ణ మొదటిగా మహేష్ కి సపోర్ట్ చేశారు. శ్రీముఖి మాత్రం ముందు బాబా భాస్కర్ కి సపోర్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ మహేష్ కి తన సపోర్ట్ ఇచ్చింది. చివరిలో వితిక,పునర్నవి ఇద్దరు కూడా తమ సపోర్ట్ బాబా భాస్కర్ కి ఇచ్చారు. దీనితో ఎక్కువ మంది సపోర్ట్ దక్కించుకొని మొదటిసారి మహేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇంటి కెప్టెన్ అయ్యాడు.