మహేష్ విషయంలో దారుణమైన పనిచేసిన హిమజ

Tuesday, September 17th, 2019, 11:15:57 AM IST

నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలిమినేట్ కోసం నామినేషన్ పద్దతి సరికొత్తగా జరిగింది. ఇందులో నామినేట్ అయిన హౌస్ మేట్ సేవ్ కావాలంటే హౌస్ లో ఒక హౌస్ మేట్ బిగ్ బాస్ చెప్పిన కొన్ని పనులు చేయాలి. ఆలా చేసినట్లు అయితే నామినేట్ అయిన హౌస్ మేట్ సేవ్ అవుతాడు. ఇందులో భాగంగా శ్రీముఖి కోసం బాబా భాస్కర్ క్లిన్ సేవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత పునర్నవి కోసం రాహుల్ ఏకంగా 20 గ్లాసులు కాకరకాయ జ్యూస్ తాగాడు. ఆ తర్వాత వరుణ్ కోసం శ్రీముఖి బిగ్ బాస్ టాటూ వేపించుకుంది. ఇక తర్వాత మహేష్ నామినేషన్ నుండి సేవ్ కావాలంటే హిమజ తన బట్టలు మరియు మేక్ అప్ కిట్ అన్ని కూడా స్టోర్ రూమ్ లో పెట్ట్టవల్సి ఉంది. దానికి హిమజ సరే అని ఒప్పుకొని తన బట్టలు అన్ని సర్ది మేక్ అప్ కిట్ తో సహా స్టోర్ రూమ్ లో పెట్టింది.

అయితే బిగ్ బాస్ కెప్టెన్ అయిన వితికాని మరోసారి హిమజ అన్ని స్టోర్ రూమ్ లో పెట్టిందో లేదో చూడమని చెప్పాడు. దీనితో వితిక వెళ్లి చూసేసరికి హిమజ మేక్ అప్ కి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. అలాగే తాను వాష్ చేయకుండా బెడ్ కింద మరికొన్ని బట్టలు ఉన్నాయి. వాటిని వితిక తీసుకోని వెళ్లి స్టోర్ రూమ్ లో ఉంచింది. ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ హిమజ తన బట్టలు మరియు మేక్ అప్ కిట్ అన్ని స్టోర్ రూమ్ పెట్టని కారణంగా మహేష్ ని నామినేట్ చేస్తున్న అంటూ ప్రకటించాడు.

ఆ తర్వాత వితిక వచ్చి మహేష్ తో మాట్లాడుతూ “హిమజ కొన్ని మేక్ అప్ సమన్లు అన్ని పెట్టకుండా కొన్నిటిని తీసి పక్కన పెట్టింది, అవి ఎందుకు పెట్టవని శివజ్యోతి అడిగితే అవి నేను యూజ్ చేయనులే అంటూ సమాధానం ఇచ్చిందని” చెప్పింది. ఆ తర్వాత హిమజ మాట్లాడుతూ “నేను అసలు బెడ్ కింద పెట్టిన బట్టలు మర్చిపోయాను, అలాగే కొన్నిటిని అసలు నేను మేక్ అప్ కిట్ అనుకోలేదు అందుకే పెట్టలేదు” అంటూ మెల్లగా చెప్పింది. ఇక్కడ గమనిస్తే హిమజకి అన్ని తెలుసు, కానీ కావాలనే కొన్నిటిని లోపల పెట్టకుండా గేమ్స్ ఆడింది. దీనితో మహేష్ నామినేట్ అయ్యాడు.