బిగ్ బాస్ 3 : విన్నర్ ఎవరో తెలుసా – మహేష్ విట్టా సంచలన వాఖ్యలు

Tuesday, October 15th, 2019, 08:53:46 PM IST

బిగ్ బాస్ మూడవ సీజన్ కూడా ఇక చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 7 మంది మాత్రమే ఉన్నటువంటి ఈ ఇంటిలో బిగ్ బాస్ 3 టైటిల్ ఎవరికీ వస్తుంది అనే విషయం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి అందరు కూడా ఈ గేమ్ మీద చాలా నమ్మకంతో ఆడుతున్నారు. ఏలాగైనా సరే ఈ సీజన్ టైటిల్ ని సొంతం చేసుకోవాలని అందరు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ షో నుండి ఎలిమినేట్ అయినటువంటి మహేష్ విట్టా, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.

మొత్తానికి మహేష్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే నెటిజన్ల ఓటింగ్ ప్రకారం రాహుల్, వరుణ్, శ్రీముఖి ముగ్గురు కూడా ముందు వరుసలో ఉన్నారని, ఈ ముగ్గురిలో ఒకరికి టైటిల్ వస్తుందని చెప్పేశారు మహేష్. కానీ ఓట్ల విషయం పక్కన పెడితే మాత్రం ఎవరు కూడా టైటిల్ పొందడానికి అర్హులు కారని మహేష్ తేల్చి చెప్పేశారు. ఇకపోతే ఈ హౌస్ లో ఎవరు కూడా నిజాయితీగా ఆడటం లేదని, శ్రీ ముఖి మాత్రం టైటిల్ మీద కన్నుతో అందరిని ఆర్టిఫిషల్ ఎమోషన్ తో ఆదుకుంటుందని చెప్పారు.