ఇప్పటి వరకు తెలుగులో రాని సెన్సషనల్ షోతో మంచు లక్ష్మి!

Wednesday, September 18th, 2019, 04:02:25 PM IST

తెలుగు బుల్లి తెర మీద ఇప్పటికే ఎన్నో వినూత్న షోలు ఉన్నాయి.ముఖ్యంగా కామెడీ,ఎంటర్టైన్మెంట్ ను బేస్ చేసుకొని తెరకెక్కి ఈ షోలకు అతీతంగా కొన్ని భిన్నమైన షోలు కూడా చాలానే వచ్చాయి.అలాంటి వాటిలో బిగ్ బాస్ మరియు మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించిన మేము సైతం లాంటి షోలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.అయితే వీటన్నిటినీ మించి ఒక సరికొత్త సెన్సషనల్ డిఫరెంట్ షోను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

మన తెలుగులో ఉన్నటువంటి హీరో మరియు హీరోయిన్లకు ఎంతమంది అభిమానులు ఉంటారో తెలుసు.అభిమాని అన్నాక ఊరుకుంటాడా తన అభిమాన నటుల ఇష్టాయిష్టాలను తెలుసుకుంటాడు.వారు ఏ సమయంలో ఏం చేస్తున్నారు.ఇప్పుడైతే ఎక్కడుంటారు ఏం చేస్తారు అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు.అలాగే పొద్దున్న అంతా షూటింగ్ లో బిజీగా ఉండేవారు రాత్రి పడుకునే ముందు ఎలా ఆలోచిస్తారు వారికి గడిచిన రోజు ఎలా ఉంది అనే విషయాలు మీలో కూడా చాలా మంది మీ అభిమాన నటుల కోసం ఆలోచించే ఉంటారు.

ఇలా మన స్టార్స్ పొద్దున్న అంతా వారి పనులు చూసుకుని రాత్రి అయ్యేసరికి బెడ్ మీద వారి భావాలు ఎలా ఉంటాయో వారి అభిమానులకు తెలియజేసేందుకు ఒక షోను తీసుకొస్తున్నారు.దీనికి “సెలెబ్రెటీస్ బెడ్ టైం స్టోరీస్” కావచ్చు లేదా బెడ్ టైం స్టోరీస్ గా తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇదే షోను ప్రస్తుతం “ఫూట్ అప్ విత్ స్టార్స్”గా హిందీలో చేస్తున్నారు.దీనితో ఇప్పుడు షోను తెలుగులో మంచు లక్ష్మి హోస్ట్ గా నిర్వహించనున్నారు.ఈ వినూత్న షో వియాకామ్ 18 లో ప్రసారం కానున్న ఈ షో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది.