100 మిలియన్ తో “మైండ్ బ్లాక్” చేసిన మహేష్.!

Saturday, July 11th, 2020, 08:03:56 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం ఎన్నో సంచలనాలు రేపింది. అయితే కమర్సిల్ గా కేవలం కంటెంట్ పరంగా మాత్రమే కాకుండా ఆడియో పరంగా కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. అయితే ఈ అన్నింటిలో మాత్రం మాస్ బీట్ “మైండ్ బ్లాక్” సాంగ్ సూపర్ స్పెషల్ అని చెప్పి తీరాలి. సెకండాఫ్ కేవలం ఈ ఒక్క సాంగ్ కోసం చూడాలి అని చెప్పినా ఏమాత్రం తప్పు లేదు. మహేష్ మాస్ స్టెప్స్ ఈ పాటను మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి.

దీనితో ఈ ఫుల్ వీడియో సాంగ్ ఇప్పుడు రికార్డు స్థాయి వ్యూస్ ను అందుకుంటుంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ మార్క్ అందుకొని మహేష్ కెరీర్ లో ఫస్ట్ ఎవర్ 100 మిలియన్ సాంగ్ గా నిలిచింది. మరి ఈ సాంగ్ ఇంకెక్కడ ఆగుతుందో చూడాలి.