“బిగ్ బాస్ 3” పై దిమ్మ తిరిగే అప్డేట్ మీకోసం.!

Friday, October 18th, 2019, 05:07:54 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న షోలలో ఒకటి “బిగ్ బాస్” ఒక ఇంట్లో ఎలాంటి సామాజిక మాధ్యమాలు లేకుండా కొన్ని రోజులు కొంతమంది మనుషులను ఉంచితే వారి స్పందన ఎలా ఉంటుంది.అలాంటి వాతావరణంలో మనుషులు ఎలా నడుచుకుంటారు అన్న దానిపై సాగే ఈ రియాలిటీ షోకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది.అయితే వాళ్ళే కాస్త సామాన్య ప్రజలకు తెలిసిన వారు అయితే ఎలా ఉంటుంది?ఇలా తెలుగులో కూడా మొదలయ్యి సూపర్ హిట్టయ్యింది.

అయితే ఇప్పటికే రెండు సీజన్లు తెలుగులో పూర్తయ్యాయి.మొదటి సీజన్ చాలా ఆహ్లాదంగా ఎలాంటి వార్ వన్ సైడ్లు ముందే ఫిక్స్ చేసుకోవడాలు లాంటివి లేకుండా నీట్ గా కొనసాగింది.ఇప్పటికీ ఎవరినన్నా అడిగినా కూడా మూడింట్లో మొదటి సీజన్ కే అందరూ ఓటేస్తారు.కానీ ఈ రెండు సీజన్ లు చూస్తే మాత్రం అసలు నచ్చడం లేదని షో మొదటి నుంచి ఇప్పటి దాకా చూస్తున్న ఫాలోవర్స్ అంటున్నారు.ఇప్పుడు ఆ కోణంలోనే దిమ్మతిరిగే విషయం ఒకటి బయటకు వచ్చింది.

ఈ సీజన్ కు కూడా ముందే టైటిల్ విన్నర్ ఎవరో ఫిక్స్ అయ్యారని వారే టైటిల్ కొట్టబోతున్నారని అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు హౌస్ లో తన ప్రవర్తన మరింత తేడాగా మరియు ఓవర్ గా కనిపిస్తుందని టాక్.అయితే ఇప్పుడు టైటిల్ రేస్ లోకి ఊహించని వ్యక్తి వచ్చారని దాదాపు వారికే ఈసారి టైటిల్ దక్కే అవకాశం ఉందని అంతర్గత సమాచారం.మొదట్లో ఒక లేడీ కంటెస్టెంట్ టైటిల్ గెలుస్తుంది అని ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు మాత్రం టైటిల్ మేల్ కంటెస్టెంట్ కొట్టడం ఖాయమని చెప్పాల్సొస్తుంది.ఇదే జరుగుతుందని అంతర్గత సమాచారం కూడా..మరి ఈసారి టైటిల్ ఎవరు కొట్టబోతున్నారో చూడాలి.