జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో..రీఎంట్రీతో అదరగొట్టిన నాగబాబు..మరో స్పెషల్ గెస్ట్ కూడా

Thursday, June 6th, 2019, 11:30:34 PM IST

ఎక్కడ ఉన్నా తెలుగు ప్రేక్షకులను ఇంటిల్లిపాది నవ్వుల్లో ముంచెత్తే ఏకైక ప్రోగ్రామ్ ఏదన్నా ఉంది అంటే అది ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే “జబర్దస్త్” ప్రోగ్రామ్ అనే చెప్పాలి.ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులకు నిరంతరం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఈ ప్రోగ్రాం ఎప్పుడు వెనకడుకు వేయలేదు.అయితే గత కొంత కాలం నుంచి మొదటి నుంచి న్యాయ నిర్ణేతలుగా కనిపిస్తున్న రోజా మరియు నాగబాబు కనిపించడం లేదు.వీరిద్దరూ ఎన్నికల బిజీ వలన కాస్త దూరం అయినా రోజా తక్కువ గ్యాప్ లోనే కనిపించారు.

ఇక అలాగే లాఫింగ్ కింగ్ నాగబాబు ను కూడా చాలా మందే మిస్సయ్యి ఉంటారు.కానీ వచ్చే గురువారం జూన్ 13 న ప్రసారం కాబోయే ఎపిసోడ్ ద్వారా నాగబాబు మళ్ళీ జబర్దస్త్ లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చినట్టు ఈ రోజు విడుదలైన తాజా జబర్దస్త్ ప్రోమోను చూస్తే తెలుస్తుంది.ఈ ప్రోమోను గమనించినట్టైతే హైపర్ ఆది తన స్కిట్ లో వేసిన పంచులు అలాగే రోజా మరియు నాగబాబుల కురిపించిన పొగడ్తలు మరో స్థాయి అని చెప్పాలి.అలాగే ఇదే స్కిట్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి పై కూడా ఆది పంచుల వర్షం ఆగలేదు.

డిఫరెంట్ షేడ్స్ లో రాఘవ చేసిన స్కిట్,ఆలాగే ఇతర టీమ్ లీడర్లు చేసిన స్కిట్లు కూడా చాలా హిలేరియస్ గా పండాయి.ఆఖరుగా వెంకీ మంకీస్ టీమ్ వారితో మళ్ళీ స్కేటింగ్ షూస్ వేయించి వారు పడే తిప్పలు కడుపుబ్బా నవ్వించాయి. ఇక మళ్ళీ టీమ్ లీడర్ల పైన తనదైన పంచులు మళ్ళీ షురూ అవుతాయని చెప్పాలి.అలాగే ఇదే ఎపిసోడ్ లో మరి నాగబాబు గ్రాండ్ రీఎంట్రీ తో ఇంకెంత అదరగొట్టారో చూడాలంటే వచ్చే జూన్ 13 రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ ను మిస్సవ్వకుండా చూడాల్సిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి