బిగ్ బాస్ ఎఫెక్ట్ : నాగార్జునకి గట్టి పంచ్ పడింది

Tuesday, July 2nd, 2019, 10:25:13 PM IST

తెలుగులో బిగ్ బాస్ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎప్పుడెప్పుడు ఆ షో స్టార్ట్ అవుతుందా అంటూ అనేక మంది ఎదురుచూస్తున్నారు. మొదటి రెండు సీజన్లు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే ప్రజాదరణ సొంతం చేసుకున్నాయి. ఈ సారి సీజన్ 3 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే గతంలో నాగార్జున బిగ్ బాస్ షో గురించి మాట్లాడమంటే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అవి తీవ్ర దుమారాన్నే లేపుతున్నాయి.

గతంలో నానితో క‌లిసి చేసిన `దేవ‌దాస్‌` సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం కోసం నాగార్జున `బిగ్‌బాస్‌` హౌస్‌కు వ‌చ్చారు. “బిగ్‌బాస్` గురించి మీ స్పంద‌న ఏమిటి` అని నాగ్‌ను నాని ప్ర‌శ్నించాడు. దీనికి స్పందించిన నాగ్‌.. “బిగ్‌బాస్` గురించి నేను మాట్లాడాల‌నుకోవ‌డం లేదు. ఎందుకంటే నేను మాట్లాడితే చెడుగా మాట్లాడాల్సి వ‌స్తుంది. నేను నాని హోస్టింగ్ గురించి మాట్లాడ‌డం లేదు. నాకు అస‌లు `బిగ్‌బాస్‌` కాన్సెప్టే న‌చ్చ‌లేదు. ఇత‌రులు ఏమి చేస్తున్నారో? ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారో గ‌మ‌నించ‌డం బాగుండ‌దు. నాకు అది న‌చ్చ‌దు. ఈ షో అంతా ఏదో గాసిపింగ్‌లా ఉంద‌`ని నాగ్ వ్యాఖ్యానించారు.

సరిగ్గా వాటినే కోడ్ చేస్తూ ఇప్పుడు నెటిజన్లు నాగార్జునని ఒక ఆట ఆడుకుంటున్నారు. నీకు ఇష్టం లేకపోతే అసలు ఇప్పుడు బిగ్ బాస్ ని ఎందుకు హోస్ట్ చేస్తున్నావు, అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒకమాట మాట్లాడటం సరైన పద్దతి కాదు. నీ దగ్గరకి ఆఫర్ వచ్చేసరికి బిగ్ బాస్ మీద నీ అభిప్రాయం మారిపోయిందా కింగ్ అంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా నాగార్జుననీ టార్గెట్ చేస్తున్నారు.