స్టేజి మీదే కోపంతో ఊగిపోయిన నాగ్..ఈ రోజు ఏమి జరగబోతుంది

Saturday, September 14th, 2019, 03:11:36 PM IST

కింగ్ నాగార్జున బిగ్ బాస్ షోని హోస్ట్ చేసే విధానం పట్ల అన్ని వర్గాల నుండి సానుకూలమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా మహిళలు ఆయన కోసమే షో చూస్తున్నారు, ఇక హౌస్ మేట్స్ తో నాగార్జున మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు తప్పులు చేస్తే వాటిని ఎట్టి చూపిస్తూ వాళ్ళని మందలించటం, అవసరానికి తగ్గట్లు సున్నితమైన హెచ్చరికలు చేయటం, మంచి పని చేస్తే మనస్ఫూర్తిగా అభినందించటం లాంటివి తనదైన రీతిలో చేస్తూ షోని ముందుకి తీసుకొనివెళ్తున్నాడు.

అయితే ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం నాగార్జున గరం గరం మీద ఉన్నట్లు ప్రోమోస్ చూస్తే తెలుస్తుంది. నార్మల్ గా నాగార్జున ఎంట్రీకి ముందు డాన్స్ ఉంటుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ డాన్స్ చేస్తుంటే నాగ్ ఎంట్రీ వాళ్లతో రెండు స్టెప్స్ వేసి షో స్టార్ట్ చేస్తాడు, కానీ నేడు మాత్రం నో సాంగ్స్, నో డాన్స్ అంటూ పాటని మధ్యలోనే ఆపించి వాళ్ళని వెళ్ళమని చెప్పి , పీకలదాకా ఉంది, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వాళ్లతో చాలా మాట్లాడాలి అంటూ నాగార్జున సీరియస్ గా చెపుతాడు. దానిని బట్టి చూస్తే ఈ రోజు షో వాడివేడిగా జరిగేలా అనిపిస్తుంది. ఈ వారం రోజులు హౌస్ మేట్స్ చేసిన తప్పులను చెపుతూ వాళ్ళకి గట్టి క్లాస్ తీసుకునే ఛాన్సులు ఉన్నాయి.