“ఆహా”లో నవదీప్ థ్రిల్లింగ్ సిరీస్ ఫస్ట్ లుక్ చూసారా?

Saturday, May 23rd, 2020, 04:48:18 PM IST


మొట్టమొదటి మన తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ “ఆహా” మన దగ్గర మార్కెట్ లోకి వచ్చిన కొద్ది సమయంలోనే మంచి పాపులారిటీను సంతరించుకుంది. కానీ ఇప్పుడున్న ఈ పోటీ రంగంలో ఇంకా మంచి స్టఫ్ మరియు మరిన్ని కొత్త సినిమాలను కూడా అందించకపోతే రాణించలేమని మరింత అర్ధం అయ్యి మరింత కేర్ తీసుకుంటామని వారు తెలిపారు.

అందులో భాగంగా మరింత నాణ్యతతో కూడిన వెబ్ సిరీస్ లను డిజైన్ చేసి అందిస్తామని తెలిపారు. అలా ఇప్పుడు తాము ప్లాన్ చేసిన ఓ వెబ్ సిరీస్ తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అధికారికంగా విడుదల చేసారు. నవదీప్ మెయిన్ లీడ్ లో తెరకెక్కించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “రన్”. ఒక హత్య ఆరుగురు నిందితులు ఊహించని థ్రిల్ తో ఈ సిరీస్ ఉండబోతుంది అని వారు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సిరీస్ ఈ మే 29న వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా అందుబాటులోకి తీసుకురానున్నారు.