బంపర్ ఆఫర్: మరోసారి నెట్‌ప్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్..!

Thursday, December 10th, 2020, 01:30:02 AM IST

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం నెట్‌ప్లిక్స్ మరోసారి బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. సాధారణంగా యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే ఇందులోని వీడియోలను చూసేందుకు వీలు ఉంటుంది. అయితే డిసెంబర్ 5,6 తేదీలలో భారత్‌లో ఉచితంగా సర్వీసులను అందించిన నెట్‌ప్లిక్స్ మరోసారి తన స్ట్రీమ్ ఫెస్ట్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇవాళ నుంచి డిసెంబర్ 11 రాత్రి 08:59 నిమిషాల వరకు ఈ ఉచిత ఆఫర్ అందుబాటులో ఉంటున్నట్టు ప్రకటించింది. అయితే ఈ సారి హై డెఫినేషన్ వీడియోలు చూసే వీలులేదు. కేవలం స్టాండర్డ్ డెఫినేషన్ వీడియోలు మాత్రమే చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సారి ఫ్రీ యూజర్ల సంఖ్యకు కూడా లిమిటేషన్ పెట్టింది.