“జెమినీ ఫ్యామిలీ”కు వింతైన షాకిచ్చిన నెటిజన్లు.!

Sunday, December 15th, 2019, 04:21:54 PM IST

తెలుగులో ఉన్నటువంటి టాప్ ఛానెల్స్ లో సోషల్ మీడియాను గట్టిగా వాడుతున్న ఛానెల్ ఏదన్నా ఉంది అంటే అది జెమినీ ఛానెల్ అని చెప్పాలి.వారు తమ ఛానెల్లో టెలికాస్ట్ చేస్తే సీరియళ్లు అలాగే సినిమాలు ఇతర ఏ అంశాల కోసం అయినా సరే కాస్త విభిన్నంగా పోస్ట్ చేస్తూ ఉంటారు.అలాగే ఇప్పటి వరకు వారు టెలికాస్ట్ చేసే సినిమాల కోసం ఎన్నో పోస్టులు పెట్టి ఇప్పుడు సీరియల్స్ దగ్గరకు వచ్చారు.అయితే ఇలాంటి పోస్టులు మనం పేస్ బుక్ మేమ్స్ లో చాలానే చూసి ఉంటాం.

అలాంటి ఓ పోస్ట్ కు నెటిజన్స్ ఇచ్చిన షాక్ చూస్తే తప్పకుండ అందరికీ నవ్వొస్తుంది.జెమినీ ఛానెల్లో ప్రస్తుతం ప్రసారం చేస్తున్న శుభ సంకల్పం,సుభద్ర పరిణయం,మట్టి గాజులు ఇలా తదితర సీరియల్స్ తో “జెమినీ ఫ్యామిలీ” అనే వాట్సాప్ గ్రూప్ చేసినట్టుగా,ఒకవేళ నిజ జీవితంలోనే ఇలాంటి గ్రూపు ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా పోస్ట్ చెయ్యగా,ఈ పోస్ట్ చూసిన కొంతమంది నెటిజన్లు తమ వాట్సాప్ నెంబర్లు పెట్టి మమ్మల్ని కూడా మీ గ్రూపులో జాయిన్ చేసుకోండి అంటూ రిప్లైలు ఇస్తున్నారు.ఇది మాత్రం భలే నవ్వు తెప్పించే విషయం అని చెప్పాలి.