“నిశ్శబ్దం” సినిమాపై ఫైనల్ క్లారిటీ.!

Saturday, May 23rd, 2020, 06:31:26 PM IST


ఇప్పుడు ఒక్కసారిగా మారిన పరిస్థితుల ప్రభావం తెలుగు సినిమాపై గట్టిగానే పడింది. దీనితో సినిమాలు థియేటర్స్ లో విదుల్ అయ్యే అవకాశాలు లేవని నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేసుకోవాల్సిందే అని బయటకొచ్చిన టాక్ ఒక్క సారిగా చాలా సినిమాలపై పడింది.

ముఖ్యంగా ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధం అయిన సినిమాలు అన్నిటి పైనా వచ్చేసింది. ఉప్పెన అనుష్క నటించిన థ్రిల్లర్ “నిశ్శబ్దం” పై చాలా ఎక్కువ పడింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓ స్ట్రీమింగ్ యాప్ లో వచ్చేయనుంది అని అనేక రకాల పుకార్లు వినిపించాయి.

అలాగే వాటితో పాటు ఈ చిత్రం అలా వచ్చేది లేదని కూడా మరో వెర్షన్ వినిపించింది. కానీ ఇప్పుడు ఒక ఫైనల్ క్లారిటీ వచ్చేసినట్టు తెలుస్తుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోనే వస్తుంది అని ఎలాంటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో వచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేసినట్టు తెలుస్తుంది. దీనితో ఈ చిత్రాన్ని థియేటర్ లోనే ఎక్స్ పీరియెన్స్ చెయ్యొచ్చు.