వెంకీ,చైతూల బ్లాక్ బస్టర్ మిస్సయ్యారా ఇప్పుడు అవ్వకండి.!

Monday, January 13th, 2020, 08:19:53 AM IST

విక్టరీ వెంకటేష్ మరియు కింగ్ నాగార్జున తనయుడు యువ సామ్రాట్ నాగచైతన్యల కెరీర్ లో ఒక గుర్తుండిపోయే చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “వెంకీ మామ” చిత్రం అని చెప్పాలి.ఈ ఇద్దరూ హీరోలుగా రాశీ ఖన్నా మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా కె ఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ చిత్రం వెంకీ మరియు చైతూల కెరీర్ లో ఒక గుర్తుండిపోయే చిత్రంగానే కాకుండా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ఫలితాన్ని కూడా అందుకుంది.

అయితే సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు స్ట్రీమింగ్ రంగంలోకి వచ్చేసింది.ఈ చిత్రం తాలుకా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న “అమెజాన్ ప్రైమ్” వారు సైలెంట్ గానే ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో లో పెట్టేసారు.సో ఒకవేళ ఈ బ్లాక్ బస్టర్ మల్టీ స్టారర్ చిత్రాన్ని కానీ మీరు వెండితెరపై మిస్సయ్యి ఉంటే అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చు.ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.