“సైరా”కు అప్పుడు దెబ్బేసి ఇప్పుడు ఆల్ టైం రికార్డ్.!

Friday, December 13th, 2019, 08:00:45 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్,మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే కిచ్చ సుదీప్ మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా వంటి ఎందరో తారలు ప్రధాన పాత్రల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “సైరా నరసింహా రెడ్డి” సరైన విధంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసుకోలేకపోయారు కానీ ఈ సినిమాకు ఉన్న కంటెంట్ కు అంతకు మించిన వసూళ్లే వస్తాయని అంతా అనుకున్నారు కానీ ఈ చిత్రం ఓవరాల్ గా వసూళ్ల విషయంలో నిరాశపరిచింది.

కానీ అటు స్ట్రీమింగ్ లో కానీ బుల్లి తెరపై కానీ ఈ చిత్రం అదరగొట్టేసింది.తాజాగా తమిళ్ వెర్సిన్ లో అక్కడ టెలికాస్ట్ చెయ్యగా ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న తెలుగు డబ్బింగ్ చిత్రాల టీఆర్పీ రికార్డులు అన్ని బద్దలు కొట్టేసి సరికొత్త రికార్డులు నెలకొల్పినట్టు తెలుస్తుంది.ఈ చిత్రానికి అక్కడ ఏకంగా 15.44 టీఆర్పీ పాయింట్స్ వచ్చాయని దీనికి ముందు మహేష్ నటించిన “1 నేనొక్కడినే” చిత్రానికి 13 అలాగే “స్పైడర్”కు 10.4 అలాగే “బాహుబలి 2″కు 10.3 వచ్చినట్టు తెలుస్తుంది.మొత్తానికి సైరా సినిమాకు వెండి తెరమీద దెబ్బేసి ఇప్పుడు ఆల్ టైం రికార్డు ఇచ్చారు తమిళోళ్ళు.ఆ ప్రమోషన్స్ ఏదో బాగా చేసుకొని ఉంటే తెలుగు మినహా అన్ని భాషల్లో కూడా ఇప్పుడు వస్తున్న రెస్పాన్సే వచ్చి ఉండేది కదా అని కొంతమంది ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.