రోహిణి విషయంలో శ్రీముఖి చెప్పిందే జరిగింది..షాక్ తిన్న ప్రేక్షకులు

Monday, August 19th, 2019, 12:24:16 PM IST

బిగ్ బాస్ హౌస్ లో వారంలో ఆరు రోజులు జరిగే ఎపిసోడ్స్ ఒక లెక్క, ఆదివారం జరిగే ఎలిమినేషన్ ఓ లెక్క. హౌస్ నుండి ఒక హౌస్ మేట్ బయటకు వెళ్ళిపోతుంది. వారం వారం జరిగే ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరికీ తక్కువ ఓట్లు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తాయో, ఎవరు హౌస్ నుండి వెళ్ళిపోతారో అనే విషయాలు హౌస్ మేట్స్ ఎవరికీ తెలియదు. కాకపోతే ఎదో కొంచము అనాలసిస్ చేస్తారు తప్పితే పర్ఫెక్ట్ గా అంచనా వేయలేరు.

అయితే శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి నామినేషన్ లో వున్నవాళ్లలో ఎవరు ఎలిమినేషన్ అయిపోతారో మూడు నాలుగు రోజులు ముందుగానే ఒక అంచనాకి వస్తుంది. గతంలో జాఫర్ విషయంలో కావచ్చు, ఆ తర్వాత తమన్నా సింహాద్రి విషయంలో కావచ్చు శ్రీముఖి ముందుగానే అంచనా వేసింది. ఇక తాజాగా రోహిణి విషయంలో కూడా శ్రీముఖి ముందుగానే అనాలసిస్ చేసి డైరెక్ట్ గా రోహిణికి చెప్పింది. ఈ వీక్ నువ్వు కొంచం డౌన్ లో ఉన్నావు. హౌస్ నుండి నువ్వు వెళ్లిపోవచ్చని చెప్పింది. దానితో రోహిణి కి శ్రీముఖి మధ్య గొడవలు కూడా జరిగాయి.

తాజాగా నిన్నటి ఎలిమినేషన్ లో రోహిణి హౌస్ నుండి వెళ్ళిపోయింది. దీనితో శ్రీముఖి అనాలసిస్ మరో సారి పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యింది. దీనిని బట్టి చూస్తే శ్రీముఖి ఎలాంటి స్ట్రాటజీతో గేమ్ ఆడుతుందో అర్ధం చేసుకోవచ్చు. పక్కాగా బిగ్ బాస్ హౌస్ తీరుతెన్నులు, ఎలిమినేషన్ అయ్యే విధానం గురించి బాగా అర్ధం చేసుకొని మరి గేమ్ కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక శ్రీముఖి అనాలసిస్ కరెక్ట్ కావటంతో హౌస్ మేట్స్ ఇక నుండి శ్రీముఖి అనాలసిస్ ని నమ్మే పరిస్థితి వచ్చింది.