“జబర్దస్త్” స్టేజ్ పై పోసాని స్కిట్ కు పొట్ట చెక్కలవ్వాల్సిందే.!

Saturday, December 14th, 2019, 03:01:52 PM IST

తెలుగు వాళ్ళని ఇంటిల్లిపాది అలరించే ఖతర్నాక్ కామెడీ షో ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా “జబర్దస్త్” షో అని చెప్పాలి.ఎవరు ఉన్నా లేకున్నా ఎంటర్టైన్మెంట్ మాత్రం టన్నుల్లో ఇస్తున్నారు.దానికి ఋజువుగా వచ్చే వారం టెలికాస్ట్ కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ తాలూకా లేటెస్ట్ ప్రోమో బయటకు వచ్చింది.ఈ ప్రోమోను చూసినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరి స్కిట్లు అదిరిపోయేలా ఉన్నాయని చెప్పాలి.మొదటగా హైపర్ ఆది ఎంట్రీయే సరికొత్తగా ఉంది.

అయితే ఇందులో గడ్డం నవీన్ కె రాఘవేంద్రరావు గారి గెటప్ లో రాగా రామ్ గోపాల్ వర్మ లా మరొకతను వచ్చాడు.అప్పుడు ఈయనేమో అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి ఎన్టీఆర్ వరకు అందరి మనసులను గెలుచుకుంటే ఈయనేమో అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి ఎన్టీఆర్ వరకు అందరి మనుషులను కెలుకుతూ వచ్చాడని వేసిన సెటైర్ హైలైట్ అయ్యింది.ఇక అలాగే జీవన్ స్కిట్ లో ప్రముఖ నటుడు మరియు రచయిత పోసాని కృష్ణ మురళీ వచ్చిన తర్వాత మాత్రం ఆ స్కిట్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.

జీవన్ కు అప్పు ఉంటే డబ్బులిచ్చి ఆదుకొని నీ అప్పు నా అప్పు కాదా నా అప్పు నీ అప్పు కాదా అన్న దగ్గర నుంచి నీ భార్య నా భార్య కాదా అన్నంత వరకు వెళ్ళింది.ఈ స్కిట్ మాత్రం చాలా హిలేరియస్ గా వచ్చినట్టు అనిపిస్తుంది.మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే డిసెంబర్ 19 గురువారం రాత్రి 9న్నర గంటలకు మీ ఈటీవీలో జబర్దస్త్ తప్పకుండా చూడాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి