“పోవే పోరా” 100వ ఎపిసోడ్ డబుల్ మాస్..!

Monday, June 10th, 2019, 02:28:08 PM IST

ఈటీవీ ప్లస్ ఛానెల్లో ప్రసారమయ్యే ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ లో సుడిగాలి సుధీర్ మరియు విష్ణు ప్రియా వ్యాఖ్యాతలుగా వ్యవహరించే “పోవే పోరా” కూడా ఒకటి. యూత్ కి అత్యంత చేరువగా ఉండే కాన్సెప్ట్ తో ఎంతో వినోదభరితంగా కొనసాగే ఈ షో అద్భుతమైన రేటింగులతో కొనసాగుతూ ఇప్పటి వరకు 99 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకొని 100వ ఎపిసోడ్ లోకి డబుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో అడుగు పెట్టబోతోంది అని తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే అర్ధం అవుతుంది.సుధీర్ ఇచ్చిన ఎంట్రీ మంచి హైప్ ను తీసుకురాగా సుధీర్ పై విష్ణు ప్రియా వేసిన పంచులు అదిరిపోయాయి.

సుధీర్ పంచె కట్టుకొని వస్తే ఆ పంచె పట్టుకొని లాగడం అలాగే సుధీర్ షర్ట్ పట్టుకొని విష్ణు ప్రియా రెండు సార్లు లాగితే సుధీర్ ఎందుకలా లాగుతున్నావ్ మాది చాలా సాంప్రదాయబద్దమైన కుటుంబం అని చెప్పడం హిలేరియస్ గా పేలాయి.అలాగే స్టూడెంట్స్ లో కూడా ఒకరి మీద ఒకరు వేసుకున్న పంచులు కూడా బాగా పేలాయి.ఇలా ఈ 100 వ ఎపిసోడ్ నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్ గా సాగింది.అలాగే ఈ ఎపిసోడ్ లోనే “పటాస్ 2” ఫేమ్ కమెడియన్స్ నూకరాజు మరియు ఫహీమా కూడా వచ్చి స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. మరి ఇన్ని హంగులతో ఈ ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే జూన్ 15 శనివారం రాత్రి 8 గంటలకు మీ ఈటీవీ ప్లస్ లో చూడాల్సిందే.

 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి