100వ ఎపిసోడ్ లో అడుగుపెట్టబోతున్న “పోవే పోరా”

Friday, June 7th, 2019, 05:45:42 PM IST

తెలుగు టెలివిజన్ తెరపై ఉన్న ఎన్నో ఛానెళ్లలో ఈటీవీ ఛానెల్ తో పాటుగా ఈటీవీ ప్లస్ ఛానెల్ కూడా ఒకటి.అలాగే ఆ ఛానెల్లో ప్రసారం అయ్యే అనేక షోలలో సుధీర్ మరియు విష్ణు ప్రియా లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించే “పోవే పోరా” ప్రోగ్రాం కు కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.స్టూడెంట్స్ కు ఎంతగానో ఇష్టమైన ఈ షో అద్భుతమైన రేటింగులతో ఇప్పటి వరకు ఈటీవీ ప్లస్ లో 99 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు సాదరంగా 100 వ ఎపిసోడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.దీనికి సంబంధించిన ప్రోమోను కూడా వీరు ఇటీవలే విడుదల చేసారు.ఎలాగో 100 వ ఎపిసోడ్ కాబట్టి ఈ సారి ఎంటెర్టైన్మెంట్ టన్నుల్లోనే ఉండబోతుంది అని ఈ ప్రోమో చూస్తేనే అర్ధం అవుతుంది.మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే జూన్ 15 శనివారం రాత్రి మీ ఈటీవీ ప్లస్ ఛానెల్లో మిస్సవ్వకుండా చూడాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి