10కి పైగా 100 మిలియన్లతో డార్లింగ్ భారీ రికార్డ్.!

Thursday, June 4th, 2020, 01:57:52 PM IST

స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పుడు ఎంతటి స్టార్డం ఉందో ప్రత్యేకించి ఒకరికి చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కెరీర్ ను ఒక్క మాటలో చెప్పాలి అంటే బాహుబలి కి ముందు ఆ తర్వాత అని చెప్పాలి. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ కు మరింత క్రేజ్ పెరగడంతో ప్రభాస్ నటించిన మునుపటి సినిమాలకు కూడా మంచి క్రేజ్ వచ్చింది.

దీనితో యూట్యూబ్ లో ప్రభాస్ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డు పడింది. మొత్తం 10కి పైగా వీడియోస్ 100 మిలియన్ వ్యూస్ దాటినవి ఒక్క ప్రభాస్ కే సొంతం అయ్యాయి. వీటిలో ఏకంగా 8 వీడియోస్ ఒక్క బాహుబలి రెండు చిత్రాలకే సంబంధించినవి ఉండగా సాహో నుంచి మూడు రెబల్ సినిమా నుంచి ఒక వీడియో ఉంది. ఇలా మొత్తం 10కి పైగా 100 మిలియన్ వ్యూస్ దాటిన ఏకైక తెలుగు హీరోగా డార్లింగ్ మన సౌత్ ఇండియా నుంచే నిలిచాడు.