“ఇస్మార్ట్” తోనే మొదలుపెట్టిన ప్రదీప్..?

Tuesday, July 2nd, 2019, 03:52:32 PM IST

ఫేమస్ యాంకర్ అయినటువంటి ప్రదీప్ ఇటీవలే తన షో అయినటువంటి “కొంచెం టచ్ లో ఉంటే చెప్తా” నాల్గవ సీజన్ అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడని ఇప్పటికే తెలిసిన విషయం. అలాగే ఈ షోలో ఎప్పటిలానే అయితే హీరోయిన్స్ లేదా హీరోలను పిలవడం ఆనవాయితీ అలాగే ఈసారి ఎవరితో మొట్టమొదటి ఎపిసోడ్ మొదలు పెడతారా అని అంతా అనుకున్న మొదటి ఛాన్స్ మాత్రం “ఇస్మార్ట్ శంకర్” కొట్టేసినట్టు తెలుస్తుంది.

పేస్ బుక్ లో ఒక తాజాగా ఒక పోస్ట్ దర్శనమిస్తుంది.దీనిలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోగా నటించిన రామ్ అలాగే నభ నటాష్ మరియు నిధి అగర్వాల్ లతో ప్రదీప్ కూడా ఉన్నాడు.దీన్ని బట్టి మొట్టమొదటి ఎపిసోడ్ వీరితోనే మొదలయినట్టు తెలుస్తుంది.ఈ మధ్యనే విడుదల చేసిన మరో ప్రోమోలో ప్రభాస్ కూడా వస్తున్నట్టుగా చిన్న హింట్ ఇచ్చారు.మరి డార్లింగ్ ను ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి.