బిగ్ బాస్ 3: పునర్నవి తో వరుణ్ గొడవ మొదలైందా?

Wednesday, September 18th, 2019, 06:55:09 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పునర్నవి-రాహుల్ రొమాన్స్ షో లో రక్తి కట్టించిందనే చెప్పాలి. నామినేషన్ ప్రక్రియ లో భాగంగా అందరు ఒకరినొకరు సేవ్ చేస్తున్నారు. అయితే వరుణ్ హిమజ కోసం పేడ లో పడుకున్నారు. అయితే నువ్వు ఇలా పేడలో పడుకోవడం నాకు ఎంతో ప్రౌడ్ గా వుంది అంటూ వితిక ఎటకారంగా అనగానే పునర్నవి కల్పించుకొని వరుణ్ తేజ్ తో గొడవకి దిగింది.

నీకు చాల ఆటిట్యూడ్ అంటూ పునర్నవి ని వరుణ్ అంటాడు. శ్రీముఖి నాకోసం పచ్చ బొట్టు వేయించుకుంది, అది లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది, నేను కూడా అలా పేడలో పడుకుంటే తప్పేంటి అని అంటాడు వరుణ్. కానీ హిమజ కోసం చేయడంతో, వరుణ్ ని చేయడం కరెక్టే కానీ ఎవరి కోసం చేస్తున్నామో కూడా ముఖ్యం కదా అని అంటుంది పునర్నవి. వీరిద్దరూ ఇలా మాట మాట అనుకోవడం తో వీరిద్దరి మధ్య గొడవ మొదలయిందా అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలైంది.