బిగ్ బాస్ 3: షో లో అసలైన మజా, “ఘాటైన ముద్దు” తో అందరి మతి పోగొడుతున్న పున్ను

Tuesday, September 17th, 2019, 11:22:19 AM IST

బిగ్ బాస్ 3 రియాలిటీ షో తెలుగులో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన ఈ రియాలిటీ షో లో ఒక్క తెలుగు లో మినహా ఇప్పటివరకు అన్ని దశలలో అన్ని సీజన్లలో హాట్ అఫైర్స్ మరియు రొమాంటిక్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఐతే ఇపుడిపుడే తెలుగులో కూడా ఇలాంటి చర్యలను మనం గుర్తించాల్సిన పరిస్థితి వుంది.

రాహుల్-పునర్నవి వీరి పెయిర్ బిగ్ బాస్ లో ఆకట్టుకుంటుందని అందరికి తెలిసిన విషయమే. బిగ్ బాస్ 3 లో వీరిద్దరి పెర్ఫార్మన్స్ ఆడియన్స్ లో ఒక అటెన్షన్ ని గైకొన్నది. వీరిద్దరి కోసమే అన్నట్లుగా జరిగిన ఒక టాస్క్ లో రాహుల్ పునర్నవి కోసం కాకరకాయ జ్యూస్ తాగాడు. ఈ సన్నివేశాన్ని చూసి చలించిన పునర్నవి రాహుల్ కి ఒక ముద్దుని పెట్టింది. షో లో వీరిద్దరి రొమాన్స్ తో బిగ్ బాస్ లో సరికొత్త ఊపు వచ్చిందని అంటున్నారు ఆడియన్స్.

అయితే అందరు ఒక విషయం పై చాల ఆసక్తిగా చర్చిస్తున్నారు. హౌస్ లో టాస్క్ ల కోసం, పెర్ఫార్మన్స్ ఇరగదీసిన, ఇదే తంతు బయట కూడా వీరిద్దరి మధ్య ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన వారీగా రాహుల్-పున్ను పెయిర్ నిలవనుంది. రకరకాల మిమి లతో ఫ్యాన్స్ ట్రోల్ల్స్ చేస్తున్నారు. లవ్ స్టేటస్ లు పెడుతున్నారు. పున్ను పెట్టిన ముద్దుకి ఈ రేంజ్ లో ఆదరణ వస్తుందని తాను కూడా ఉహించి ఉండదు.