బిగ్ బ్రేకింగ్ : బిగ్ బాస్ నుండి రాహుల్ ఎలిమినేట్

Saturday, September 21st, 2019, 06:12:19 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలిమినేషన్ లో ముగ్గురు ఉన్న విషయం తెలిసిందే, హిమజ, మహేష్, రాహుల్ ఈ ముగ్గరు ఈ వారం హౌస్ నుండి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి వారం ఒక్కో హౌస్ మేట్ హౌస్ నుండి ఎలిమినేట్ కావటం జరుగుతుంది, కానీ ఈ వారం మాత్రం డబల్ ఎలిమినేషన్ ఉంటున్నట్లు నాగార్జున ప్రకటించాడు. ఈ రోజు ఒక ఎలిమినేషన్, రేపు ఒక ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు.

ఇందులో భాగంగా ఈ రోజు ఎలిమినేషన్ లో రాహుల్ ని బయటకు పంపినట్లు మనకి ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. హౌస్ లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని చెప్పగానే హౌస్ మేట్స్ అందరు షాక్ అయ్యారు. అంతే కాకుండా ప్రోమో లోనే హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో చూపించారు. హౌస్ మేట్స్ అందరు ఎలిమినేట్ అయ్యిన హౌస్ మేట్ ని మెయిన్ డోర్ నుండి బయటకు పంపే సీన్ చూపించారు.

అక్కడ గమనిస్తే రాహుల్ హౌస్ నుండి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత పునర్నవి ఏడుస్తూ లోపాలకి వెళ్లే సీన్స్ కూడా చూపించారు. సో ఈ వారం మొదటి ఎలిమినేషన్ లో రాహుల్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు, అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బిగ్ బాస్ లో ఒక్కోసారి హౌస్ మేట్ ని ఎలిమినేట్ చేసి, వాళ్ళని ఒక రూమ్ లో ఉంచి కొన్ని రోజులు తర్వాత హౌస్ లోకి తీసుకొనివస్తారు. అప్పట్లో ముమైత్ ఖాన్ ని ఉంచినట్లు ఒక సీక్రెట్ రూమ్ లో ఉంచుతారు. బహుశా రాహుల్ విషయంలో అలాంటిది చేస్తే చేయవచ్చు.