తన కుల వృత్తిపై రాహుల్ అద్దిరిపోయే కామెంట్స్.!

Tuesday, November 19th, 2019, 02:45:31 PM IST

ప్రస్తుతం తెలుగు స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ మరియు ప్రిస్టేజియస్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు.అయితే అంతకు ముందు రాహుల్ తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అయ్యారు.కానీ అంతకు ముందు రాహుల్ కుటుంబ వృత్తి ఏమిటి?వారు తాతల కాలం నుంచి చేసే కుల వృత్తి ఏమిటి అన్నవి పెద్దగా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు.కానీ నిన్న టెలికాస్ట్ అయ్యిన “ఆలీతో సరదాగా” ఎపిసోడ్ లో రాహుల్ తన కుల వృత్తి కోసం మరియు కులం కోసం కొన్ని అద్భుతమైన కామెంట్స్ చేసారు.

తమ కుల వృత్తి రీత్యా తన తండ్రి హాంగ్ కాంగ్ లో బార్బర్ గా పని చేసారని తాను కూడా కొన్నాళ్ళు చేసి ఈ రంగంలో మక్కువ వల్ల ఇటు వైపు వచ్చానని చెప్పారు.అయితే అప్పుడు ఆలీ దీని వల్ల తాను ఎప్పుడైనా నామోషీ ఫీలయ్యారా అని అడగ్గా రాహుల్ అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.అసలు కుల వృత్తిని మర్చిపోయిన వాడు అసలు మనిషే కాదని అలాగే ఒక మనిషిని అందంగా తీర్చి దిద్దే పనిని తాను చేసినందుకు ఇంకా గర్వపడుతున్నానని కూడా మైండ్ బ్లోయింగ్ సమాధానం ఇచ్చారు.